PATTU VASTRAMS & PEARLS PRESENTED TO KODANDARAMA _ శ్రీ కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ

Vontimitta, 26 Apr. 21: The AP endowment minister Sri Velampalli Srinivasa Rao on Monday presented pattu vastrams and pearls to Sri Kodandaramaswami temple on behalf of the AP Government.

It is an age-old practice to present vastrams and pearls officially on the occasion of the Sri Sitarama Kalyanam fete in the Vontimetta temple 

TTD board member and Rajampeta MLA Sri Meda Mallikarjun Reddy, TTD JEO Smt Sada Bhargavi, DyEO Sri Ramesh Babu, Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 26: ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమ‌వారం రాత్రి నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మూల వరులను దర్శించుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ చిప్పగిరి ప్రసాద్, జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.