PAVITHROTSAVAMS AT SRI CHENNAKESAVA SWAMY TEMPLE, THALLAPAKA FROM AUGUST 28 TO 30_ ఆగష్టు 28 నుండి 30 తేదీ వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirupati / Tallapaka, August 21, 2025: The annual Pavithrotsavams will be observed with religious fervour at Sri Chennakesava Swamy Temple in Tallapaka, Annamayya district, from August 28 to 30, 2025.
As part of the festivities, Punyahavachanam, Rakshabandhanam, Mritsangrahanam, and Ankurarpanam will be performed on August 27.
To protect the sanctity of the temple and atone for any lapses or omissions committed unknowingly by devotees or temple staff during the course of the year, the Pavithrotsavams are conducted every year for three days. Rituals like purification, Punyahavachanam, and other sacred ceremonies are performed as part of the festival.
On August 28, at 9 a.m., Yagashala Puja, Chatushtarchana, Bimba, Mandala, Kumbha Aradhanas, and Pavitra Pratishtha will be held, followed by Pavitra Homams at 6 p.m.
On August 29, at 9 a.m., Vedic rituals in Yagashala including Pavitra Samarpana to the presiding deity, Utsava Murthies, and Parivara Devatas will be performed, followed by Nitya Homams at 6 p.m.
On August 30, at 6 a.m., Pavitra Visarjana, Pavitra Jala Prokshanam, Maha Poornahuti, Pavitra Vitarana will be observed, and at 6 p.m., the grand procession of the Utsava Murthies of Sri Chennakesava Swamy and Ammavaru will take place.
On this occasion, Harikathas and music programs will also be organized under the aegis of TTD’s Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగష్టు 28 నుండి 30 తేదీ వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి / తాళ్లపాక, 2025 ఆగష్టు 21: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఆగష్టు 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. పవిత్రోత్సవాలకు ఆగష్టు 27న పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగష్టు 28న ఉదయం 9 గంటలకు యాగశాల పూజ, చతుష్టార్చన, బింబ, మండల, కుంభ ఆరాధనలు, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు పవిత్రహోమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 29న ఉదయం 9 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మూలవర్లకు, ఉత్సవర్లకు, పరివార దేవతాలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు నిత్య హోమాలు నిర్వహిస్తారు.
ఆగష్టు 30న ఉదయం 6 గంటలకు పవిత్ర విసర్జన, పవిత్ర జల ప్రోక్షణ, మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
