PAVITHROTSAVAMS AT TONDAMANPURAM SRI VENKATESWARA SWAMY TEMPLE _ ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, 03 August 2025: The annual Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, will be conducted with religious fervor at the Tondamanpuram temple from August 6 to 9, 2025.
The festivities will commence on August 6 with Ankurarpanam at 6 PM.
Program Schedule:
August 7: Morning – Pavitra Pratishta, Evening – Vedic rituals in Yagashala
August 8: Morning – Pavitra Samarpana, Evening – Chatushtana Archana
August 9: Morning – Maha Poornahuti, distribution of pavitras, Snapanatirumanjanam, and Chakrasnanam. The event concludes with Evening Prakara Utsavam and Asthanam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025 ఆగస్టు 03: తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 8న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేపడతారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
