PAVITHROTSAVAMS COMMENCE AT AMARAVATI IN SRI VENKATESWARA SWAMY TEMPLE _ అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati / Amaravati, August 19, 2025: The Pavithrotsavam rituals commenced with religious fervour on Tuesday at Sri Venkateswara Swamy Temple, Venkatapalem, Amaravati.

As part of the programme, Panchagavya Aradhana, Akalmasha Homam, Vastu Puja, and Vastu Homam were performed in the Yagashala in the morning. 

Later, Snapana Tirumanjanam was conducted, during which the Utsava idols of the deities were ceremoniously offered special Abhishekam.

In the evening, Vaidika programmes, Pavitra Pratishtha, Adhivasa, and Sarvadaivatya Homam will be performed.

Superintendent Sri Mallikarjuna, Temple Inspectors Sri Ramakrishna and Sri Sandeep, temple priests, and a large number of devotees participated in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి / అమరావతి , 2025 ఆగష్టు 19: అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స‌స్వామి ఆలయంలో మంగ‌ళ‌వారం పవిత్రోత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో భాగంగా ఉదయం యాగ‌శాల‌లో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వ‌హించారు. అనంత‌రం స్నపన తిరుమంజనం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.  సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమంచేపడుతారు.

ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహాశాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభసమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.