PAVITHROTSAVAMS CONCLUDES AT SKVST _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 19 October 2025: The three-day Pavithrotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram concluded on Sunday with Poornahuthi.

Snapana Tirumanjanam, Yagashala rituals and Poornahuthi were performed, followed by Kumbhaprokshanam and Acharya Bahumanam. 

The temple Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Ramesh Babu and other staff, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2025 అక్టోబ‌రు 19: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వ‌హించారు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంతో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి,  సూప‌రింటెండెంట్ శ్రీ రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీధ‌న‌శేఖర్, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.