SARVADOSHAPASAMANA UTSAVAM ENTERS DAY 2 _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
PAVITRA MALAS OFFERED
TIRUMALA, 06 AUGUST 2025: The three-day annual Pavitrotsavams entered second day on Wednesday and the sacred and colourful Pavitra Malas were offered to the deities on the occasion.
Also known as Sarva Doshopansamana Utsavam, the Pavitrotsavams were in vogue in 15-16 centuries and reinstated from 1962 onwards by TTD.
These Utsavams are of purification in nature and are called by different names like Dosha Nivarana, Sarva Yagna Phalaprada, Sarva Kamaprada, Sarva Tustikara.
The Pavitra Garlands, are woven out of silk threads in blue, green, yellow, red and white and these threads are prepared out of a high-grade cotton plant.
Earlier in the morning Snapana Tirumanjanam was performed to the utsava deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi and later the Pavitra Malas were decorated to the deities.
The Senior and Junior Pontiffs of Tirumala, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, Chief Priests of the temple, DyEO Sri Lokanatham and other temple staff, devotees were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుమల, 2025 ఆగష్టు 06: తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.














