PAVITROTSVAMS COMMENCES _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 27 SEPTEMBER 2023: The annual three-day Pavitrotsvams commenced on a spiritual note in Tiruchanoor on Wednesday.
After performing Dhwajakumbha Avahanam, Chakradi Mandala Puja, Chatustanarchana, Agni Pratista, Pavitra Pratista was performed.
In Sri Krishna Mukha Mandapam, snapanam was performed to the Utsava deity of Sri Padmavathi Ammavaru.
JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, AEO Sri Ramesh and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023 సెప్టెంబరు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు , వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.