PAVITRA PRATISTA HELD AT SRI PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

Tiruchanoor, 12 Sep. 19: Pavitra Prathishta ritual was performed as a part of the grand Three days Pavitrotsavams which commenced at Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Thursday morning.

Kankana Bhattar Sri Vempali Srinivasacharyulu performed Sahasrarachana before Pavitra Pratistha and later Snapana Tirumanjanam was performed.

TTD has cancelled all arjita sevas for the day in view of Pavitrotsavams.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Smt Malleswari, Arjitam Inspector Sri Kola Srinivasulu and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

సెప్టెంబరు 12, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల్లో మొద‌టిరోజు గురువారం పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు. ఆ తరువాత కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాదిమండల పూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీపద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కారణంగా తిరుప్పావ‌డ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.

కాగా, సెప్టెంబరు 13న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 14న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.