PAVITRA PURNAHUTI HELD AT VONTIMITTA _ పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati / Vontimitta, 26 August 2025: As part of the ongoing three day annual Pavithrotsavams at Vontimitta Sri Kodanda Ramalayam in Kadapa district, the sacred fete concluded with Pavitra Purnahuti on Tuesday.
In the evening, Tiruveedhi Utsavam will be performed.
The temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen, temple priests, and devotees took part in this sacred event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి / ఒంటిమిట్ట, 2025 ఆగస్టు 26: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





