PAVITRA SAMARPAN HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

TIRUPATI, 19 JULY 2024: As part of ongoing Pavitrotsavam fete  at Sri Kapileswara temple on Friday, TTD organised the Pavitra Grandhi Samarpana with religious fervour.

The festivities began with the Yagasala Puja, Homas, Purnahuti and Grandhi Pavitra Samparna.

Later in the evening besides others Pavitra Pratista  ceremony will be observed.

DyEO Sri Devendra babu, AEO Sri Subbaraju, Superintendent Sri Krishna Sharma and temple archakas were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

తిరుపతి, 2024 జూలై 19: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం వేడుక‌గా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల పూజ‌, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ‌సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగ‌శాల‌పూజ‌, హోమం, ప‌ట్టు ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.