PAVITRA SAMARPANA AT APPALAYAGUNTA TEMPLE _ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, 14 Sep. 20: As part of the ongoing annual Pavitrotsavam festival the Pavitra Samarpana ritual was performed on Monday morning in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta.
After the daily Nitya pujas Snapana Tirumanjanam was performed for the utsava idols of Sri Prasanna Venkateshwara Swamy and His consorts at the yagashala.
Thereafter Pavitra Samarpana was conducted to the Mula Virat, Mahalakshmi Devi, and Andal Ammavaru, Sri Anjaneya Swamy, Dwajasthambham and galaxy of other deities.
Speaking on the occasion the TTD JEO Sri P Basant Kumar narrated the significance of the annual three-day event of Pavitrotsavams.
He said after Pavitra Pratista on Sunday, Pavitra Samarpana was done on Monday and the event would conclude on Tuesday with Maha Purnahuti.
Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam, Superintendent Sri Gopalakrishna Reddy, Temple inspector Sri Srinivasulu also participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2020 సెప్టెంబరు 14: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం మూల విరాట్‌కు, ఉత్సవర్లకు, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జయవిజయులకు, గరుడాళ్వార్‌కు, శ్రీ ఆంజనేయస్వామివారికి, ధ‌్వజస్థంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. కాగా రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగేదోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తొందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం పవిత్ర ప్రతిష్ట, సోమవారం పవిత్ర సమర్పణ నిర్వహించారని చెప్పారు. మంగళవారం మహా పూర్ణాహూతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనువాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.