PAVITRA SAMARPANA FETE HELD _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirumala,16 August 2024: On the second day of the ongoing annual Pavitrotsavam at Srivari temple on Friday Pavitra Samarpana ritual was grandly performed wherein the TTD EO Sri J. Syamala Rao participated.
As a part of the festivities at the temple, Yagasala Snapana Tirumanjanam was performed at the Sampangi Prakaram and thereafter amidst Vedic chants and Mangala Vaidyams, Pavitra Malas were decked to all the main idols and utsava idols inside temple, Dwaja Stambham, Bali Peetham, Sri Varaha Swamy and Sri Bedi Anjaneya outside the temple.
Later in the evening, Sri Malayappa Swami along with His consorts will bless the devotees along the Mada streets.
In view of the festivities, TTD has cancelled Arjita Sevas like Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahara Deepalankara Sevas.
Tirumala pontiffs, Additional EO Sri Ch Venkaiah Chowdhary, temple DyEO Sri Lokanatham and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుమల, 2024 ఆగష్టు 16: తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో
శ్రీ జె.శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.