PAVITRA SAMARPANA HELD _ అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

Tirupati, 29 September 2024: As a part of the ongoing annual Pavitrotsavams in Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta, Pavitra Samarpana was held on Sunday.
 
The colourful silk threads were adorned to the deities on the occasion.
 
In the evening, Sridevi Bhudevi sameta Sri Prasanna Venkateswara takes a celestial ride along Mada streets encircling the temple.
 
DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

తిరుపతి, 2024 సెప్టెంబరు 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా చేప‌ట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.