PAVITRA SAMARPANA HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Tirupati, 17 September 2024: The colourful silk threads were decorated to all the main and utsava deities at Sri Padmavati Ammavaru temple in Tiruchanoor on Tuesday.

As a part of the ongoing annual Pavitrotsavams on the second day, Pavitra Samarpana was held in a religious manner.

Temple officials and grihasta devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2024 సెప్టెంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని దంపతులు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుభాష్, శ్రీ గణేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.