PAVITRA SAMARPANA HELD AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణÇ

TIRUPATI, 28 SEPTEMBER 2023: The Pavitra Malas were offered to all the deities as a part of the ongoing annual Pavitrotsvams in Tiruchanoor temple on Thursday.

DyEO Sri Govindarajan and other temple staffs, Grihasta devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2023 సెప్టెంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో  జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు.

ఆతరువాత పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో  అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
             
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ రమేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, శ్రీ మణికంఠ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.