‌PAVITROTSAVAMS COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు  ప్రారంభం‌

PAVITROTSAVAMS COMMENCES
 
Tirupati, 18 July 2024: The annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple commenced on a grand religious note on Thursday.
 
As a part of this, the Pancha Murthies of Sri Kapileswara Swamy, Sri Kamakshi Devi, Sri Vighneswara Swamy, Sri Subramanya Swamy, Sri Chandikeswara Swamy Utsavarlu rendered Snapana Tirumanjanam.
 
In the evening Kalasa Puja, Homam, Pavitra Pratista will be observed.
 
DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju and others were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం‌

తిరుపతి, 2024 జూలై 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో భాగంగా ఉద‌యం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, గంధం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం నిర్వహించారు. ‌

సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ,, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.