PAVITRA PRATISTA HELD _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 05 SEPTEMBER 2025: The annual Pavitrotsavams commenced at Sri Padmavati Ammavaru temple in Tiruchanoor on Friday.
As a part of it Snapana Tirumanjanam was performed to the Utsava deity of Ammavaru in Sri Krishna Mukha Mandapam.
TTD Chairman Sri BR Naidu, board members Sri Krishna Murty, Sri Santaram, DyEO Sri Harindranath and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
తిరుపతి, 2025, సెప్టెంబర్ 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం శాస్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం 09.00 నుండి 11.30 గంటల వరకు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
మధ్యాహ్నం 03.00 నుండి 04.00 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
06వ తేదీ శనివారం రెండోవ రోజు పవిత్ర సమర్పణ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి, శ్రీ శాంతా రామ్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, పలువురు అర్చకులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







