PAVITROTSAVAMS BEGINS AT TONDAMANADU_ శాస్త్రోక్తంగా తొండ‌మాన్‌పురం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 07 AUGUST 2025: The annual Pavitrotsavams commenced on a grand religious note in Tondamanadu also known as Tondamanpuram on Thursday.
 
On first day Pavitra Pratista was observed which will be followed by a series of Yagasala rituals in the night.
 
Temple Superintendent Sri Gnana Prakash, temple inspector Sri Sudheer, temple priests were also present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా తొండ‌మాన్‌పురం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

తిరుప‌తి, 2025 ఆగ‌స్టు 07: తొండ‌మాన్‌పురం శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. 

ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం చ‌తుష్ట‌ర్చ‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 09వ తేదీ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. 

ఈ కార్యక్రమంలో సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుదీర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.