PAVITROTSAVAMS CONCLUDES _ మహా పూర్ణాహుతితో ముగిసిన చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, 14 October 2025: The annual Pavitrotsavams in Kodandarama Swamy temple at Chandragiri concluded on a grand religious note with Maha Purnahuti on Tuesday.
Temple officials and archakas participated in this festival.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మహా పూర్ణాహుతితో ముగిసిన చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025, అక్టోబర్ 14: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
సాయంత్రం 5 గంటలకు శ్రీ కోదండరామ స్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వామి వార్లతో వీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరిండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





