PAVITROTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
TIRUPATI, 20 JULY 2024: The annual Pavitrotsavams culminated with Maha Purnahuti in Sri Kapileswara Swamy temple on Saturday.
In the evening the Panchamurthies paraded along the streets to bless the devotees.
DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Krishna Verma, temple inspector Sri Bala Krishna and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2024, జూలై 20 ; తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం యాగశాలపూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు.
సాయంత్రం పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.