PAVITROTSAVAMS IN JAMMALAMADUGU TEMPLE _ జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్రోక్తంగా అంకురార్పణ
TIRUPATI, 12 SEPTEMBER 2024: The Ankurarpanam fete was performed on Thursday evening for the annual Pavitrotsavams at Sri Narapura Venkateswara Swamy temple in Jammalamadugu.
The annual Pavitrotsavams will be observed from September 13-15.
Temple officials and priests participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 సెప్టెంబరు 12: జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు.
సెప్టెంబరు 13న చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.