PAVITROTSAVAMS IN KRT _ ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
TIRUPATI, 26 JULY 2021: The three-day annual Pavitrotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati will be observed from August 4 to 6 with Ankurarpana on August 3.
This annual fete will be observed in Ekantam due to Covid 19 restrictions.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2021 జూలై 26: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఆగస్టు 4న మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 5న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 6న మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం జరుగనుంది. సాయంత్రం ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.