PAVITROTSVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
TIRUPATI, 15 JULY 2023: The three day annual Pavitrotsvams concluded on grand religious note with Purnahuti in Sri Kodandarama Swamy temple at Tirupati on Saturday.
DyEO Smt Nagaratna, Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu, AEO Sri Parthasaradi, Kanakana Bhattar Sri Ananda Kumar Deekshitulu and others, devotees were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023, జూలై 15: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి.
ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, కంకణభట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.