PAVITROTSVAMS IN KANYAKUMARI TEMPLE _ నవంబరు 23 నుండి 25వ తేదీ వరకు కన్యాకుమారి శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
TIRUPATI, 21 NOVEMBER 2023: The annual Pavitrotsvams in Sri Venkateswara Swamy temple at Kanyakumari will be observed between November 23 and 25 with Ankurarpanam on November 22.
During these days Snapana Tirumanjanam will be observed to the Utsava Murties.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 23 నుండి 25వ తేదీ వరకు కన్యాకుమారి శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023 నవంబరు 21: కన్యాకుమారిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా నవంబరు 22వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
నవంబరు 23వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నవంబరు 24వ తేదీ ఉదయం పవిత్ర సమర్పణ చేస్తారు. నవంబరు 25వ తేదీ సాయంత్రం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల సందర్భంగా నవంబరు 23, 24వ తేదీల్లో ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.