PEDDA SESHA VAHANA SEVA HELD _ పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి క‌టాక్షం

TIRUMALA, 15 OCTOBER 2023: The Pedda Sesha Vahana Seva was held with religious fervour in Tirumala on the first day evening of the ongoing Navaratri Brahmotsavams on Sunday.

In Paramapada Vaikunthanatha Alankara, Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi blessed His devotees along the four mada streets.

Both the seers of Tirumala, TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, board members, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి క‌టాక్షం

తిరుమల, 2023 అక్టోబరు 15: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడుతలల పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ వాహన సేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.