PEDDA SESHA VAHANA SEVA HELD _ పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

TIRUMALA, 17 NOVEMBER 2023: In connection with the auspicious Naga Panchami, Pedda Sesha Vahanam observed in Tirumala on Friday evening.

 

Sri Malayappa accompanied by His two consorts Sridevi and Bhudevi on either sides took out a celestial ride on the seven hooded Pedda Sesha Vahanam.

 

The deity blessed His devotees all along the four mada streets during the procession held between 7pm and 9pm.

 

DyEO Sri Lokanatham,  EE Sri Jaganmohan Reddy, Health Officer Dr Sridevi, Peishkar Sri Srihari and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

తిరుమల, 2023 న‌వంబ‌రు 17: నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో క‌లిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇఇ శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.