PEDDA SESHA VAHANA SEVA HELD _ పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
Tirumala, 25 October 2025: On the pleasant evening on Saturday, the devotees witnessed the grand procession of Sri Malayappa Swamy on Pedda Sesha Vahanam in Tirumala.
Flanked by Sridevi and Bhudevi on either side, Sri Malayappa glided along four mada streets on the seven-hooded divine serpent carrier to bless His devotees on the auspicious occasion of Nagaula Chaviti.
HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, AP Minister Sri Nadendla Manohar, TTD Chairman Sri B.R.Naidu, VGO Sri Surendra, Peishkar Sri Rama Krishna and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం
తిరుమల, 2025 అక్టోబర్ 25: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.







