PEDDASESHA VAHANA SEVA HELD _ పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుని అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
TIRUPATI, 18 FEBRUARY 2025: The annual Brahmotsava vahana seva in Srinivasa Mangapuram commenced on Tuesday evening with Peddasesha Vahanam.
Adiseshu, the mightiest serpent king is often represented with seven hoods as Peddasesha Vahana of Sri Srinivasa Swamy. And he takes the pride of being the first carrier among the various vahana sevas being observed during the nine day Brahmotsavam of Sri Kalyana Venkateswara.
Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Rajkumar, large number of devotees and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుని అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2025 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నాథుని అలంకారంలో కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.
శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల