PETA UTSAVAM ON FEBRUARY 2 _ ఫిబ్రవరి 2న పేట ఉత్సవం

Tirupati, 31 January 2026: The Utsava Idols of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana from Sri Kodandarama Swamy Temple, Tirupati, will be taken in a ceremonial procession to Kupucandrapeta village on February 2.

The Utsava Idols reach Kupucandrapeta village, located about 8 km from Tirupati, at 9.30 a.m. and subsequently, Snapana Tirumanjanam will be performed.

Later, Unjal Seva will be conducted between 4 p.m. and 5 p.m., followed by Gramotsavam.

After the completion of the festivities, the Utsava idols return to the temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 2 పేట ఉత్సవం

తిరుపతి, 2026 జనవరి 31: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2 తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారుఅనంతరం స్వామిఅమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారుసాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించితిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా  ఉత్సవాన్ని నిర్వహిస్తారుఉదయంసాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలుకోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.