SRI KODANDARAMA SWAMY PETA UTSAVAM _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tirupati, 02 February 2026: The annual Peta Utsavam of Sri Kodandarama Swamy   Temple in Tirupati, was celebrated in a grand manner on Monday in connection with Magha Pournami. 

The utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Kodandarama Swamy were taken in a procession to Kupuchandrapeta village, where Snapana Tirumanjanam and Unjal Seva were performed as per tradition to the deities.

Bhajans and Kolatams were organized during the processions under the aegis of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project. 

Temple officials and a large number of devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 02: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ  ముని కుమారన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.