PHOTO EXHIBITION SHOWCASING THE GLORY OF TTD TEMPLES AT VONTIMITTA _ ఒంటిమిట్టలో టీటీడీ ఆలయాల వైభవాన్ని తెలియజేసే ఫోటో ప్రదర్శన

Vontimitta / Tirupati, March 30, 2026: On the occasion of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy at Vontimitta, TTD has made comprehensive information about temples managed under its aegis across the country available to devotees. A special photo exhibition has been organized by the TTD Public Relations Department opposite the PAC at Vontimitta.

The exhibition features the history of the Ontimitta Sri Kodandarama Temple, along with visuals highlighting its magnificent architecture and rich sculptural heritage. Information related to the statues of Jambavantha and Tallapaka Annamacharya has also been made available to devotees.

In addition, details of various TTD temples such as Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa, Soumyanatha Swamy Temple at Nandalur, and Sri Venkateswara Swamy Temple at Jammalamadugu, along with other temples across the state and country under TTD, are included in the exhibition.

Each temple’s history, background of establishment, unique features, and spiritual significance are presented in detail. Information on routes to reach these temples is also provided, which will be highly useful for devotees in planning future pilgrimages.

TTD appeals to devotees visiting the Brahmotsavams to visit the exhibition, learn about the history, grandeur, and uniqueness of TTD temples, and experience spiritual bliss.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్టలో టీటీడీ ఆలయాల వైభవాన్ని తెలియజేసే ఫోటో ప్రదర్శన

ఒంటిమిట్ట / తిరుపతి, 2026 మార్చి 30: ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాల సమగ్ర సమాచారాన్ని భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఒంటిమిట్టలోని పీఏసీకి ఎదురుగా టీటీడీ సమాచార విభాగం ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ చరిత్ర, ఆలయంలోని అద్భుత శిల్పకళా వైభవం, శిల్ప సంపదకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. అలాగే జాంబవంతుడు, తాళ్లపాక అన్నమాచార్య విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.

అదేవిధంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయం, జమ్మలమడుగు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వంటి ఆలయాలతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల వివరాలను కూడా ప్రదర్శనలో పొందుపరిచారు.

ప్రతి ఆలయానికి సంబంధించిన చరిత్ర, స్థాపన నేపథ్యం, ప్రత్యేకతలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆయా ఆలయాలకు చేరుకునే మార్గాల వివరాలను సవివరంగా తెలియజేశారు. ఈ సమాచారం భక్తులకు భవిష్యత్తులో ఆలయ దర్శనాలకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఈ ప్రదర్శనను తిలకించి టీటీడీ ఆలయాల చరిత్ర, వైభవం, విశిష్టతలను తెలుసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.