PHYSICAL FITNESS TESTS FOR TTD SECURITY CANDIDATES _ తితిదే సెక్యూరిటీ గార్డు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
TIRUPATI, JUNE 14: Physical fitness tests have been conducted for the candidates who are aspiring to be the security guards of Tirumala Tirupati Devasthanams (TTD) under ex-servicemen category in Tirupati on Friday.
As a part of this, 5km running race and chin up, abdominal exercises have been conducted to the candidates at Srivari mettu in Srinivasa Mangapuram and Police Parade Grounds in Muthyala Reddy Palle areas in the temple town of Tirupati. Of the 201 candidates who made their presence for the physical fitness tests, 132 passed the tests by proving their calibre and stamina. There will be written exams for the selected candidates on June 30.
Meanwhile these tests have been carried out in the presence of Tirupati JEO Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar, ACVSO Sri Shivakumar Reddy, NCC Commandant Col KJ Roy, Recruitments Dy EO Smt Chenchu Lakshmi and others.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తితిదే సెక్యూరిటీ గార్డు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
తిరుపతి, జూన్ 14, 2013: తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికుల కేటగిరీలో సెక్యూరిటీ గార్డుల నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి మెట్టు వద్ద అభ్యర్థులకు ఐదు కిలోమీటర్ల పరుగు పోటీ, ముత్యాలరెడ్డిపల్లెలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో చిన్ అప్స్, అబ్డామినల్ ఎక్స్‌ర్‌సైజ్ పోటీలు జరిగాయి. మొత్తం 201 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాగా 132 మంది అర్హత సాధించారు. వీరికి జూన్ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.
తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివి అండ్ ఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ రాజశేఖర్, ఎన్‌సిసి గ్రూప్ కమాండెంట్ కల్నల్ కెజెఎం.రాయ్, అదనపు సివిఎస్‌వో శ్రీ టి.శివకుమార్‌రెడ్డి, నియామకాల విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి, ఇతర నిఘా మరియు భద్రత అధికారులు సెక్యూరిటీ గార్డు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.