PILGRIMS’ COMPLIMENT TTD TOWARDS IMPROVEMENT OF ANNAPRASADAMS _ డయ‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు

TIRUMALA, 24 MAY 2025: Devotees pour in appreciation on TTD towards the improvement of the quality and continuous distribution of Annaprasadam facility in Tirumala.

The compliments were received during the Dial your EO live phone-in programme held by the TTD EO Sri J. Syamala Rao along pilgrim callers from across the country, held at Annamaiah Bhavan in Tirumala on Saturday.

In this program, many devotees appreciated the facilities provided by TTD and the reforms undertaken in the recent times. During this session, the EO answered several questions posed by 35 devotees. Some excerpts:

Sri Nagasreenu – Rajahmundry

Question: “Is there a possibility of releasing extra darshan tokens in July in view of summer vacation?”

EO: “There is no possibility of releasing additional tokens online as already Tirumala Hills are brimming with heavy pilgrim influx. 

Usharani – Hyderabad

Question: “Can we send another person along with senior citizens for darshan assistance?”

EO: Srivari Sevaks are available to assist senior citizens and physically handicapped devotees for Darshan

Prasad Raju – Devarapalli

Question: “In the past, room allocation centers were available at different places in Tirumala besides CRO

EO: “Due to the problems arising from room allocation in other areas, we have limited it to the CRO and even majority of pilgrims expressed their pleasure

Dr. Manoj – Chhattisgarh

Question: “Can special darshan be arranged for paramilitary forces?”

EO: The armed forces already have this facility. We will pursue the possibilities

Bindu – Hyderabad

Question: “The cleanliness at the Pushkarini is not maintained. Devotees are bathing with soap and shampoo.”

EO: we will ensure steps to protect the sanctity of Pushkarini.

Lakshmi Narayana – Hyderabad

Question: “In Srinivasa Mangapuram, only one Brahmin is available for offering Vedaseervachanams”.

EO: “We will look into this matter

Besides, several pilgrim callers also given feedback on various issues like Srivari Seva, Arjitha Seva, Anga Pradakshina, Senior citizens and physically handicapped and many more to which EO responded to their queries that any measures will be taken seeing the possibilities and in the larger interests of the devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

డయ‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు.
 
తిరుమ‌ల‌, 2025 ; శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు  చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు.  ఈ సందర్భంగా టీటీడీ ఈవో 35 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
 
1.శ్రీ స‌త్య నారాయ‌ణ-హైద‌రాబాద్‌.
 
ప్ర‌శ్న :  ల‌డ్డూ సేవ‌ను 65 సంవ‌త్స‌రాలు దాటిన వారికి ఇవ్వండి. ప‌ర‌కామ‌ణి సేవలో పాల్గొన్న‌వారికి ప్ర‌తిరోజూ ద‌ర్శ‌నం క‌ల్పిస్తే బాగుంటుంది?
 
ఈవో  : ప‌ర‌కామ‌ణి సేవ చేసిన‌వారికి ప్ర‌తిరోజూ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం సాధ్యంకాదు. ల‌డ్డూసేవ‌ను గ‌తంలో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి స‌రైన ఫ‌లితాలు రానందున ఆపేయ‌డం జ‌రిగింది.
 
2.శ్రీ నాగ‌శ్రీను-రాజ‌మండ్రి.
 
ప్ర‌శ్న : జూలై నెల‌లో ద‌ర్శ‌నాల‌కు అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశం ఉందా?
 
ఈవో  :  ఆన్ లైన్ లో అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశంలేదు. క‌రెంటు బుకింగ్ లో మాత్ర‌మే ద‌ర్శ‌న టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
 
3.ఉషారాణి-హైద‌ర‌బాద్‌.
 
ప్ర‌శ్న‌ : సీనియ‌ర్ సిటిజ‌న్ ద‌ర్శ‌నాల్లో స‌హాయ‌కులుగా మ‌రొక‌రిని పంపించేందుకు వీలవుతుందా?
 
ఈవో :  అలాంటి అవ‌కాశం ఉండ‌దు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయం అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు అందుబాటులో ఉంటారు.
 
4.ప్ర‌సాద‌రాజు-దేవ‌ర‌ప‌ల్లి.
 
ప్ర‌శ్న‌ :  గ‌తంలో తిరుమ‌ల‌లో సీఆర్వోలోనే కాకుండా ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయింపు కేంద్రాలు ఉండేవి. ప్ర‌స్తుతం సీఆర్వోలో మాత్ర‌మే గ‌దులు ఇస్తుండ‌టంతో భ‌క్తులు ఇబ్బంది ప‌డుతున్నారు?
 
ఈవో :  ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయింపు వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని సీఆర్వోకే ప‌రిమితం చేశాం. దీనిపై భ‌క్తుల నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది.
 
5.డాక్ట‌ర్ మ‌నోజ్‌- చ‌త్తీస్‌ఘ‌డ్‌
 
ప్ర‌శ్న‌ : శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి పారామిలిట‌రీ ద‌ళాల‌కు ప్ర‌త్యేక అవ‌కాశం క‌ల్పించండి?
 
ఈవో  : ఇప్ప‌టికే ఆర్మ‌డ్ ఫోర్స్ కు ఈ అవ‌కాశం ఉంది. కోటా పెంచ‌డం సాధ్యం కాదు. ఆర్మ‌డ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తాం.
 
6.తిరుప‌త‌య్య‌-హైద‌రాబాద్‌
 
ప్ర‌శ్న: అఖిలాండ వ‌ద్ద చిరు వ్యాపారుల వ‌ద్ద భ‌ద్ర‌తా సిబ్బంది డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు?
 
ఈవో : వివ‌రాలు తెలియ‌జేస్తే ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.
 
7.రేవంత్-అనంత‌పురం.
 
ప్ర‌శ్న :  స‌ర్వ ద‌ర్శ‌నానికి వ‌చ్చి దివ్యాంగులు ఇబ్బంది ప‌డుతున్నారు. వారికి ఏమైన ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం ఉందా?
 
ఈవో : ఇప్ప‌టికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగుల‌కు జారీ చేస్తున్నాం. భ‌క్తుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం క‌ల్పించ‌లేం.
 
8. గిరిధ‌ర్-విజ‌య‌వాడ‌.
 
ప్ర‌శ్న‌: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌మో భారం దృష్ట్యా ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌స‌తి గ‌దులు కేటాయింపు, అన్న‌ప్ర‌సాద కేంద్రంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది?
 
ఈవో : గ‌దుల కేటాయింపు విష‌యంలో మీ సూచ‌న‌ను ప‌రిశీలిస్తాం. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని హాల్‌-1లో ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.
 
9.గోపాల్ రెడ్డి-హైద‌ర‌బాద్‌.
 
ప్ర‌శ్న : బ్రహ్మోత్సవాల్లో దాత‌ల ద‌ర్శ‌న కోటా ర‌ద్దు చేస్తున్నారు?
 
ఈవో  : భ‌క్తుల అధిక ర‌ద్దీ కార‌ణంగా దాత‌ల ద‌ర్శ‌న కోటాను ర‌ద్దు చేస్తున్నాం. 
 
10.అరుణ్‌-హైద‌ర‌బాద్‌.
 
ప్ర‌శ్న : తాము అర్చ‌న‌ టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యానికి మా అబ్బాయికి 12 ఏళ్లు ఉండేవి. ద‌ర్శ‌నాకి వ‌చ్చేట‌ప్ప‌టికి 13 ఏళ్లు నిండటంతో అనుమ‌తివ్వ‌డం లేదు. ఇలాంటి వారికి ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉంటుందా?
 
ఈవో : నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డం సాధ్యం కాదు.
 
11. సుధాక‌ర్-క‌డ‌ప‌.
 
ప్ర‌శ్న : దివ్యాంగుల‌ను వీల్ చైర్ లో ఆల‌యం లోప‌ల‌కి అనుమ‌తించండి?
 
ఈవో  : ఆల‌యంలో స్థ‌లాభావం వ‌ల్ల సాధ్యం కాదు.
 
12. బిందు-హైద‌రాబాద్‌.
 
ప్ర‌శ్న : శ్రీ‌వారి పుష్క‌రిణీలో ప‌రిశుభ్ర‌త పాటించ‌డంలేదు. స‌బ్బులు, షాంపుల‌తో స్నానం చేస్తున్నారు?
 
ఈవో  : విచారించి చ‌ర్య‌లు చేప‌డ‌తాం.
 
13. నారాయ‌ణ‌-ఒంగోలు. గోపి-ఖ‌మ్మం.
 
ప్ర‌శ్న : దేశ ర‌క్ష‌ణ‌కు ఒక సంవ‌త్స‌ర హుండీ ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. క్యూలైన్ల‌లో 5-10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయండి?
 
ఈవో  : పిల్ల‌ల‌కు ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న ఏర్పాట్లు చేస్తున్నాం.   
 
14. ర‌వి కుమార్‌-కావ‌లి.
 
ప్ర‌శ్న : టీటీడీ నేత్ర దాన ట్ర‌స్టు ఏర్పాటు చేస్తే ఎంతో మంది భ‌క్తుల‌కు మేలు జ‌రుగుతుంది?
 
ఈవో  : ఈ అంశంపై ఇప్ప‌టికే అర‌వింద్ కంటి ఆసుప‌త్రితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లో విధివిధానాలు ప్ర‌క‌టిస్తాం.
 
15. మ‌హేశ్వ‌ర‌రావు-న‌ర్సారావు పేట‌.  
 
ప్ర‌శ్న : ఎస్ఎస్‌డీ టోకెన్లు రాత్రి స‌మయంలో జారీ చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నాం?
 
ఈవో  : భ‌క్తుల సూచ‌న మేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
 
16. నర్సా నాయుడు-అనంత‌పురం.
 
ప్ర‌శ్న : శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద న‌డ‌క‌దారిని వ‌చ్చే భ‌క్తులంద‌రికీ టోకెన్లు ఇవ్వండి?
 
ఈవో  : ఇప్ప‌టికే రోజుకు 3 నుండి 4వేల వ‌ర‌కు టోకెన్లు జారీ చేస్తున్నాం. ఆ సంఖ్య‌ను పెంచితే స‌ర్వ ద‌ర్శ‌న భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగుతుంది.
 
17. నామాల‌స్వామి-కాకినాడు. శ్యామ‌ల కుమార్‌-కామారెడ్డి.
 
ప్ర‌శ్న  : శ్రీ‌వారి సేవ‌కు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అవ‌కాశం ఇవ్వండి?
 
ఈవో   : ఆఫ్ లైన్ లో ఇవ్వ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదులు రావ‌డంతో ఆన్ లైన్ లో ఇస్తున్నాం. శ్రీ‌వారి సేవ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నాం.
 
18. ల‌క్ష్మీ నారాయ‌ణ‌-హైద‌ర‌బాద్‌.
 
ప్ర‌శ్న :  శ్రీ‌నివాస మంగాపురంలో వేద ఆశీర్వ‌చ‌నాన్ని ఏక బ్రాహ్మ‌ణుడే ఇస్తున్నాడు?
 
ఈవో  :  ఈ అంశాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.
 
టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.