PM BALA PURASKAR AWARDEE PERFORM _ ముత్యపు పందిరి వాహనం ముందు ఆకట్టుకున్న కళా బృందాలు

Tirupati, 19 November 2025: As part of the ongoing Brahmotsavam of Sri Padmavati Ammavaru at Tiruchanoor, cultural programs by various art groups in front of the Mutyapu Pandiri Vahanam impressed devotees on Wednesday morning.

The Prime Minister Rashtriya Bal Purashkar Awardee Gaurav Reddy participated in the Goshadi folk dance.

Gondu Nrityam, Kerala Drums, Manipur Traditional Dance, Kolatam were performed besides Kuchipudi and Bharata Natyam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ముత్యపు పందిరి వాహనం ముందు ఆకట్టుకున్న కళా బృందాలు 

తిరుపతి, 2025, నవంబర్ 19: శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం ముందు పలు కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ మ్యూజిక్ కళాశాల ఆధ్వర్యంలో కళాకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

పొన్నూరుకు చెందిన అయోధ్య కళామండలి ఆధ్వర్యంలో కోలాటం, ఒడిశా రాష్ట్రం నుండి క్లాసికల్ డాన్స్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ ఆధ్వర్యంలో కూచిపూడి, విజయవాడ కళాకారుల కోలాటం, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి సహస్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోషడి ఫోక్ డ్యాన్స్, గోషడి ఫోక్ డ్యాన్స్ లో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురష్కార్ అవార్డు గ్రహీత గౌరవి రెడ్డి పాల్గొనడం విశేషం. 

కర్నాటక నుండి అన్నమయ్య కీర్తనల నృత్యం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో భరత నాట్యం, తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుండి కోలాటం, మహారాష్ట్ర నుండి పాండురంగ నృత్యం, హైదరాబాద్ కు చెందిన విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ నుండి గోండు నృత్యం, విశాఖ నుండి శ్రీ మన్నారాయణ ఆర్ట్స్ అకాడమీ నుండి గొండు నృత్యం, కేరళ నుండి నవమిత్ర సంస్థ నుండి కేరళ డ్రమ్స్, బెంగుళూరు నుండి శ్రీ స్వప్న నృత్యాలయ సంస్థ కళాకారులు మణిపూర్ సాంప్రదాయ నృత్యం, తిరుపతి నుండి వైభవ వేంకటేశ్వర సంస్థ ఆధ్వర్యంలో కోలాటం, కర్నూల్ నుండి లాస్య కూచిపూడి కళాబృందం నుండి కూచిపూడి, ధర్మవరంకు చెందిన మానస నృత్య కళాబృందం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.