POCKET DEVOTIONAL BOOKS RELEASED _ పుస్తక ప్రసాదంలో భాగంగా ప్యాకెట్ పుస్తకాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

Tirumala, 30 September 2025: The TTD Chairman Sri BR Naidu released 10 pocket-size devotional books as Pustaka Prasadam.

These books will be distributed to the devotees. 

The program was held in front of the Chandraprabha Vahanam on Tuesday. 

TTD run Hindu Dharma Prachara Parishad will provide free books to the devotees, that includes Sri Venkateswara Suprabhatam, Sri Srinivasuni Divya Katha, Bhaja Govindam, Sri Shankaracharya Krita Stotramulu, Vishnu Sahasranama Stotram, Sri Lalita Sahasranama Stotram, Srimad Bhagavad Gita, Ratha Saptami, Maha Shivratri, Kartika Vaibhavam.

On this occasion, the TTD Chairman distributed Pustaka Prasadams to the devotees who came to witness the Chandraprabha Vahanam. 

A few TTD Board members, HDPP Secretary Sri Sriram Raghunath and several officials participated in the program. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

పుస్తక ప్రసాదంలో భాగంగా ప్యాకెట్ పుస్తకాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు 

తిరుమల, 2025, సెప్టెంబర్ 30: శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం అందించేందుకు వీలుగా 10 ప్యాకెట్ సైజ్ పుస్తకాలను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలోని వాహన మండపంలో మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనం ప్రారంభం అయ్యాక ఈ కార్యక్రమం జరిగింది. 

టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ముద్రించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శ్రీనివాసుని దివ్య కథ, భజగోవిందం, శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు, విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, శ్రీమద్ భగవద్గీత, రథసప్తమి, మహాశివరాత్రి, కార్తీక వైభవం తదితర పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందిస్తారు.

ఈ సందర్భంగా చంద్రప్రభ వాహనం సేవకు వచ్చిన భక్తులకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పుస్తక ప్రసాదాలను పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు, 

హెచ్డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరాం రఘునాథ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది