POLICE CASE FILED FOR TRYING TO DISGRACE TTD CHAIRMAN ON SOCIAL MEDIA _ టీటీడీ చైర్మన్ ప్రతిష్ట దిగజార్చే కుట్ర
Tirumala, 25 Jan. 21: TTD chairman Sri YV Subba Reddy on Monday evening expressed anguish over attempts to defame him on a social platform with an agenda to cause scare and confusion among Srivari devotees.
The TTD Board Chief has directed vigilance officials to register cases on such perpetrators on social media.
During a recent public function at Rajahmundry, while interacting with media over the recent attacks on temples as a foul play by opposition to defame state government and said the almighty-be it Bhagavan, Jesus or Allah are protecting the humanity and the government will not spare the culprits who damaged deities by attacking temples.
But some vested interests intentionally morphed the video, twisted and Misquoted reports on social media
The Chairman has directed TTD Vigilance officials to register a case of both defamation and conspiracy against the baseless social media reports.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టీటీడీ చైర్మన్ ప్రతిష్ట దిగజార్చే కుట్ర
తిరుమల 25 జనవరి. 2021: సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లపై పోలీసు కేసు నమోదుకు ఆదేశం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రతిష్ట దిగజార్చేందుకు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన కుట్ర పై శ్రీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తి గతంగా తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు భక్తుల్లో ఆందోళన చెలరేగేలా జరిగిన ఈ చర్యపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల మీద జరిగిన దాడుల గురించి విలేకరులు శ్రీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ భగవంతుడు ( శ్రీ వేంకటేశ్వర స్వామి) జీసస్, అల్లా కాపాడుతున్నారనీ, వారి మీదే దాడులు చేసే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.ఇది ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు చేస్తున్న కుట్ర అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఈ వీడియోను కట్ చేసి ఆయన మాటల్లోని ఉద్దేశం మార్చేలా వీడియో అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ సుబ్బారెడ్డి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడారు. ఈ దుష్ప్రచారం, కుట్రపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది