POPULARISE ANNAMAIAH WORKS- TTD CHAIRMAN _ అన్నమయ్య సంగీతామృతాన్ని మరింతగా జన బహుళంలోకి తీసుకుని వెళతాం- ” శ్రీ వేంకటేశ పదములు” పుస్తకావిష్కరణ సభలో టీటీడీచైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

SRI VENKATESA PADAMULU BOOK RELEASED

Tirupati, 13 September 2023: The TTD Chairman Sri Bhumana Karunakara Reddy gave a clarion call towards popularising Annamacharya Sankeertans in a big way which crusaded against the caste barriers in society for almost six centuries ago.

He was participating as Chief Guest in the book release function of Sri Venkatesa Padamulu jointly published by TTD’s HDPP and Shanta Vasantha Trust, Hyderabad at Mahati Auditorium in Tirupati on Wednesday morning.

Speaking on the occasion, the TTD Chairman said Saint Poet Annamacharya who struggled against social injustices has penned the glory of Sri Venkateswara in a simple language whose 600th Jayanti was celebrated during his first stint as chairman at Tallapaka village in a majestic way. A 108 feet statue was installed on the occasion. He said the TTD through its Annamacharya project is striving to take the Sankeertans to the doorsteps of people through various spiritual programmes.

He said it is heartening to note that Dr Varaprasad Reddy, a legend in biotechnology has ventured into the social and devotional spectrum by bringing out this compilation of  Annamacharya Sankeertans.

TTD chairman said the TTD would reprint 25,000 copies of the present book on Annamaiah and distribute them to students to inspire them. TTD EO Sri AV Dharma Reddy said so far TTD has completed publishing 1000 Sankeertans with commentary and an action plan is underway to complete others. He lauded Dr Varaprasad Reddy for collecting the Annamaiah Sankeertans lying at Thanjavur library and publishing them.

On behalf of Dr Varaprasad Reddy, TTD Chairman felicitated Book reviewer Sri Veturi Anandamurthy, SVBC Chairman Sri Sai Krishna Yachendra, TTD Asthana Vidhwan Dr Balakrishna Parsad with a gold bracelet and shawl. 

JEO for Health and Education Smt Sada Bhargavi, Annamacharya Project Director Sri Vibhishana Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య సంగీతామృతాన్ని మరింతగా జన బహుళంలోకి తీసుకుని వెళతాం

” శ్రీ వేంకటేశ పదములు” పుస్తకావిష్కరణ సభలో టీటీడీచైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి 13 సెప్టెంబరు 2023: సమాజంలోని కుల వివక్షను 600 సంవత్సరాల క్రితమే వ్యతిరేకించి పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని తన సంకీర్తనల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల సంగీతామృతాన్ని మరింతగా జనబాహుళ్యం లోకి తీసుకుని వెళతామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

మహతి ఆడిటోరియంలో బుధవారం తిరుమల- తిరుపతి దేవస్థానముల
ధార్మిక ప్రాజెక్టులు, శాంతా వసంతా ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన” శ్రీ వేంకటేశ పదములు” పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, సామాజిక దాష్టీకాలపై పోరాడిన వ్యక్తి, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తిని సరళమైన భాషలో ప్రజలకు అందించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి ఉత్సవాలను గతంలో తాను చైర్మన్ గా ఉండగా తాళ్లపాక గ్రామంలో అత్యద్భుతంగా జరిపామని చెప్పారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించామన్నారు. అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనల్లో 12వేలు మాత్రమే లభించాయన్నారు. వీటిని మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీఅన్నమాచార్య ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఈ దిశగా మరింత బాధ్యతగా పని చేస్తుందని శ్రీ కరుణాకరరెడ్డి చెప్పారు. నిరంతరం సామాజిక, ఆధ్యాత్మిక సేవలో తలమునకలై ఉండే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం అభినందనీయమన్నారు. ఆయన కు స్ఫూర్తినిచ్చిన జర్మన్ రచయిత స్టీఫన్ త్సయిక్ రచించిన “విరాట్” పుస్తకాన్ని తాను కూడా అనేకమార్లు చదివానన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని 25 వేల కాపీలు తెలుగులో ముద్రించి ఉచితంగా అందిస్తానని ఆయన ప్రకటించారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్ధమైనట్లేనన్నారు. అన్నమయ్య వీటన్నింటిని అవపోసన పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని తెలిపారు. 600 ఏళ్ల క్రితమే సామాజిక వివక్షపై ఆయన పోరాడారని తెలిపారు. ఆనాటి కాలంలోని భాష ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకునే అవకాశం లేదని చెప్పారు. అందుకే అన్నమాచార్యుల సంకీర్తనలకు అర్థం, ప్రతి పదార్థం ఇతర విశేషాల ను వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా పుస్తక రూపంలో తేవడానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు ఏర్పాటు చేశామన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1000 సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలు పూర్తి చేశామని చెప్పారు. మిగిలినవి కూడా పూర్తి చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నామని ఈవో తెలిపారు. వీటితోపాటు అవకాశం ఉన్నన్ని సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి తంజావూరులైబ్రరీలో ఉన్న సంకీర్తనలను సేకరించి ప్రత్యేక బృందం ద్వారా వాటిని పరిష్కరించి పుస్తక రూపంలో తేవడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో శాంతా వసంతా ట్రస్ట్ హైదరాబాదు వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ విభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, గ్రంథ పరిష్కారకర్తలు శ్రీ వేటూరి ఆనందమూర్తి, శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, టీటీడీ ఆస్థాన గాయకులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ పాల్గొన్నారు. శాంతా వసంతా ట్రస్టు తరపున శ్రీ వేటూరి ఆనందమూర్తి, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్,
శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర లను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి స్వర్ణ కంకణం తో సత్కరించారు. టీటీడీ తరఫున స్వామివారి శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందించారు. శాంతా వసంతా ట్రస్ట్ తరఫున డాక్టర్ వరప్రసాద్ రెడ్డి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి లకు సంపూర్ణ రామాయణ చిత్రపటాన్ని బహూకరించారు. అలాగే జేఈవో శ్రీమతి సదా భార్గవి, గ్రంథ పరిష్కార కర్తలు శ్రీ సర్వోత్తమరావు, శ్రీ బసవ శంకరరావు, శ్రీ మోదుగుల రవికృష్ణ, ప్రకృతి వ్యవసాయ వేత్త శ్రీ విజయరాం, ఎస్వీ బీసీ ప్రొగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి రామలక్ష్మి కి రామాయణ చిత్ర పటాలను బహూకరించారు. అంతకుముందు నెల్లూరు కు చెందిన ప్రముఖ వేణు గాన కళాకారులు శ్రీ సాయి హేమంత్ (శ్వాస మురళి) వేణుగాన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది