POSTERS OF CHANDRAGIRI TEMPLE BTU RELEASED _ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
Tirupati, 29 March 2022: TTD JEO Sri Veerabrahmam on Tuesday released the posters of the annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Chandragiri slated from April 10-19 with the Sri Rama Navami fete on April 10.
Releasing the posters at his chambers in TTD administrative buildings, the TTD JEO said Ankurarpanam will be performed on April 9 at 6 am and Dwajarohanam on April 10 between 7am and 7:45am.
He said prominent events ahead of the Brahmotsavam were Ugadi Asthanam on April 2, and Koil Alwar Tirumanjanam on April 5.
He said highlight of the Brahmotsavam were Hanumanta vahana on April 14, Sitarama Kalyanam and Garuda Vahana on April 16.
TTD is conducting Snapana Tirumanjanam for Swamy, Ammavaru and Chakrathalwar on April 18 followed by Chakra Snanam and Dwajavarohanam fete at night heralding the finale of the Brahmotsavam.
Among other festivities on April 16 TTD is performing the Kalyanotsavam in which devotee couples could participate with a ticket of ₹750 and on April 19 Sri Rama Pattabhisekam will be observed.
Local temples Dyeo sri Subramaniam, Superintendent Sri Srinivasulu, temple inspector Sri Krishna Chaitanya were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి, 2022 మార్చి 29: చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోగల జెఈవో కార్యాలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 19వ తేదీ వరకు శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఉదయం 7 నుండి 7.45 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారన్నారు. చంద్రగిరి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
అదేవిధంగా ఆలయంలో ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు వివరించారు.
ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.45 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సర్లకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.
కాగా, ఏప్రిల్ 16న ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.