POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
Tirumala, 31 May 2026: The monthly Pournami Garuda Seva was held at Tirumala on Sunday evening with utmost religious fervour.
On the pleasant evening of Magha Pournami, under the sheath of a full moon light, Sri Malayappa paraded on the mighty Garuda Vahanam to bless His devotees along four mada streets between 7pm and 9pm.
H H Sri Sri Sri Chinna Jeeyar Swami of Tirumala, TTD Board Member Sri Shantaram, JEO (Health & Education) Dr. Sharath, other officials, and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2026 మే 31: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






