POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా పౌర్ణమి గరుడసేవ

TIRUMALA, 17 OCTOBER 2024: The monthly Pournami Garuda Seva was observed with utmost religious fervour in Tirumala on Thursday evening.

Sri Malayappa Swamy in all His splendour blessed the devotees along the four mada streets on the mighty Garuda Vahanam.

Both the Pontiffs of Tirumala, CVSO Sri Sridhar, SP Sri Subbarayudu, DyEO Sri Bhaskar, Temple Peishkar Sri Ramakrishna, AEO Sri Naik, Parupattedar Sri Himatgiri, other staff, were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2024 అక్టోబ‌రు 17: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడు, డిప్యూటీ ఈఓ శ్రీ భాస్క‌ర్‌, పేష్కార్ శ్రీ రామ‌కృష్ణ‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.