POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ

TIRUMALA, 29 SEPTEMBER 2023: The monthly Pournami Garuda Seva was observed with religious fervour in Tirumala on Friday evening.

Sri Malayappa paraded along four mada streets blessing the devotees under Ghatatopam(cover from rains)even in the showers.

Temple officials and devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2023 సెప్టెంబరు 29: తిరుమలలో శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.