PRANAYA KALAHOTSAVAM HELD _ తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
Tirumala, 18 Jan. 22: The unique annual festival, Pranaya Kalahotsavam was observed in Tirumala on Tuesday evening.
The processional deities of Sri Malayappa Swamy on one palanquin and His consorts on different palanquins reached in opposite directions near Swamy Pushkarini.
The Jeeyangars recited Nammalwar Pasurams written in “Nindastuti” mode on the occasion.
Later the religious staff divided into two groups with one group taking the side of Sri Malayappa and another group supporting the Goddesses.
The love game enacted in this unique festival in an interesting way making everyone joyous. The Goddesses threw floral balls at Sri Malayappa who tactfully escaped from the shots. With the Swamy varu asking both the Goddesses for an apology, the interesting fest concluded on a happy note and the deities enter inside the temple again.
Both the senior and Junior Pontiffs of Tirumala, Additional EO Sri AV Dharma Reddy, VGO Sri Bali Reddy and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
తిరుమల, 2022 జనవరి 18: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.