PRANAYA KALAHOTSAVAM OF SRI GOVINDARAJA SWAMY HELD _ వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ప్రణయ కలహోత్సవం
Tirupati, 13 February 2025: The Pranaya Kalahotsavam was celebrated at Sri Govindaraja Swamivari Temple in Tirupati on Thursday.
It is customary to conduct Pranaya Kalahotsavam as part of the adhyayanotsavams every year.
As part of this, Sri Govindaraja Swamy ascended the palanquin at 5pm in the evening and went to the Kumbhaharati Mandapam in the temple premises. After that the temple court was held.
Both the pontiffs of Tirumala, Temple Deputy EO Smt. Shanti and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ప్రణయ కలహోత్సవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 13: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకి ఎక్కి ఆలయ ప్రాంగణంలోని కుంభహారతి మండపం వద్దకు, అమ్మవార్లు చెరొక పల్లకిపై స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో విహారయాత్రకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.