PRASANNA VENKANNA RIDES GARUDA VAHANA _ గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసం
Tirupati, 4, June 2023: On the fifth day of the ongoing annual Brahmotsavam celebrations of Sri Prasanna Venkateshwara temple, Appalayagunta, Swami Rode his favourite Garuda Vahana and blessed devotees on Sunday.
The most important Vahana of the Brahmotsavam festival, Garuda signifies service, devotion to parenthood, spotless character and community welfare activities. It is the strong belief of devotees that Swami Darshan on Garuda Vahana granted all Punya and moksha.
JEO Sri Veerabrahmam couple, DyEO Sri Govindarajan, VGO Sri Manohar, superintendent Smt Srivani, inspector Sri Shivkumar were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసం
తిరుపతి, 2023 జూన్ 04: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.
బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.
వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ మనోహర్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.