PRASANNA VENKATESWARA BLESSES AS SRI RAMA _ హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
Tirupati, 05 June 2023: Sri Prasanna Venkateswara Swamy blessed His devotees as Sri Kodandarama on Hanumantha Vahanam on Monday.
The Vahanam took place on the sixth day morning as a part of the ongoing annual brahmotsavam in Appalayagunta.
Superintendent Smt Srivani and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2023 జూన్ 05: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో స్వామివారు దర్శమిచ్చారు.
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.