PRASANNA VENKATESWARA KALYANAM HELD _ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం
TIRUPATI, 20 JUNE 2024: The Kalyanam of Sri Prasanna Venkateswara along with Sridevi and Bhudevi was held with religious fervour in Appalayagunta on Thursday evening.
As part of it Vishwaksena Aradhana, Punyahavachanam, Kankana Dharana, Agni Pratista, Sankalpam, Mangalya Dharana, Mangala Harati were rendered on the occasion.
DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar, devotees were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం
• జూన్ 21న గరుడ సేవ
తిరుపతి, 2024 జూన్ 20: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
సాయంత్రం 4.30 గంటలకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.
డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూన్ 21న గరుడ సేవ:
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది