PREPARE DPR ON ANNAMAIAH MARGAM- TTD CHAIRMAN _ అన్నమయ్య మార్గం అభివృద్ధి కి డిపిఆర్ సిద్ధం చేయండి- అన్నమయ్య మార్గాన్ని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 2 January 2022: TTD Chairman Sri YV Subba Reddy on Sunday directed officials to prepare a DPR for rejuvenation of the road to Tirumala trekked by saint poet Sri Tallapaka Annamacharya, which is also popularly known as Annamaiah Margam.

The TTD Chairman inspected the road from Mamandur to Paruveta Mandapam in Tirumala on Sunday and directed officials to prepare a comprehensive survey and send proposals to the Forest department for its revival as resolved recently by the TTD board.

He said the Annamaiah Margam will be useful for all devotees coming on foot from YSR Kadapa district and Hyderabad.

He said in the backdrop of recent rain havoc, which caused land slides and heavy damage to both the ghat roads, the Annamaiah Margam will serve as a suitable alternative to devotees.

He directed officials to prepare DPR for 23 kms and call for tenders for a road from Mamandur to Tirumala without any hindrance to wild life in the forest belt.

He said laying of such a third road was envisaged during the regime of former CM YS Rajasekhar Reddy and was debated in the TTD board as well.

Now as per the directives of AP CM Sri YS Jaganmohan Reddy the Third road to Tirumala will be developed at the earliest.

TTD DFO Sri Srinivasulu Reddy and Deputy EE Civil Sri Ramakoteswar Rao were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

అన్నమయ్య మార్గం అభివృద్ధి కి డిపిఆర్ సిద్ధం చేయండి
– అన్నమయ్య మార్గాన్ని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 2 డిసెంబరు 2022: శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు సమగ్ర ని నివేదికలు (డిపిఆర్) తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం శ్రీ సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్, వై ఎస్ ఆర్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమలకు ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న విషయాన్ని ఛైర్మన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమల కు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చైర్మన్ తెలిపారు. దివంగత సిఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ మార్గం అభివృద్ధి గురించి ఆలోచన చేశారని, అప్పటి టీటీడీ ధర్మ కర్తల మండలిలో కూడా చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, డి ఈ శ్రీ రామ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.