PRESENTATION OF MERIT AWARDS _ – 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం

Tirupati,15 August 2024: The 78th Independence Day celebrations was grandly held at the Parade Grounds of the TTD Administrative Building in Tirupati with the TTD EO Sri J Syamala Rao hoisting the national tricolour flag and receiving guard of honours presented by the TTD vigilance personnel.

After the completion of cultural programs, the EO presented srivari silver medals and appreciation certificates to 36 officers and 251 employees of various wings of TTD.

The EO also presented cash awards to the children of TTD employees who scored top marks that included ₹2116 to 19 students of Inter and ₹1116 to 55 students of Tenth class.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

– 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం

– ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

తిరుపతి, 2024 ఆగష్టు 15: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ సతీష్ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు 2,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు 1,116/- నగదు బహుమతులు అందజేశారు.

ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ఏ దేశమేగినా ఎందు కాలెడినా…..”, ” భవతు భారతి…” తదితర దేశభక్తి గీతాలకు చ‌క్క‌టి నృత్యం ప్ర‌ద‌ర్శించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.