PRESERVE THE VALUABLE KNOWLEDGE TREASURE IN MANUSCRIPTS FOR NEXT GEN- TTD JEO ( E& H) _ తాళపత్రాల్లోని జ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు కృషి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
Tirupati, 02 July 2023: The Manuscripts Project was commenced by TTD during last under the instructions of TTD EO Sri AV Dharma Reddy for preserving the vast knowledge embedded in them for the sake of coming generations, said TTD JEO for Health and Education Smt Sada Bhargavi.
Addressing the valedictory session of the two-day national seminar on Manuscript digitisation technologies organised by the Sri Venkateswara Vedic University in the varsity on Sunday evening, the JEO said manuscripts which were digitized will be published in the form a book once the work is complete.
She released a book titled “Veda Surabhi” on the occasion. The VC of SVVU Acharya Rani Sadasiva Murty presided over the occasion.
Manuscripts Donor Sri Rajendra Prasad Dayama, Prof.Vasudeva, Manuscript Project Officer Smt Vijaya Lakshmi, Varsity Registrar Sri Radhesyam and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తాళపత్రాల్లోని జ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు కృషి
– టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
– ఎస్వీ వేదవర్సిటీలో ముగిసిన మాన్ స్క్రిప్ట్ జాతీయ సదస్సు
తిరుపతి, 2023, జూలై 02: మన పూర్వీకులు వివిధ అంశాలపై తాళపత్రాల్లో నిక్షిప్తం చేసిన జ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ విశేషంగా కృషి చేస్తోందని జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో “మాన్ స్క్రిప్ట్ డిజిటైజేషన్ టెక్నాలజీస్” పై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వేద సురభి అనే పుస్తకాన్ని జేఈవో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ టీటీడీ వద్ద గల తాళపత్రాలను డిజిటైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఏడాది క్రితం మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. డిజిటైజేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు సహకరించిన పండితులకు, ప్రాజెక్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. డిజిటైజేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేశామన్నారు. డిజిటైజేషన్ పూర్తయిన తాళపత్రాలను పుస్తక రూపంలోకి తీసుకువస్తామని తెలిపారు.
వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాళపత్రాల దాత శ్రీ రాజేంద్రప్రసాద్ దయామ, ఆచార్య పివి.వాసుదేవ, మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తాళపత్రాల పరిశోధకులు హాజరయ్యారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.