PRESIDENT OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

The Honourable President of India HE Smt Droupadi Murmu,  offered prayers in the hill shrine of Sri Venkateswara Swamy in Tirumala temple on Friday along with her family members and entourage.

Following the temple tradition, she first offered prayers in Sri Varaha Swamy temple and then reached Maha Dwaram of Tirumala temple where she was received by the TTD Trust Board Chairman Sri BR Naidu, EO Sri AK Singhal, Additional EO Sri Ch Venkaiah Chowdary and accorded the traditional ”Isthikaphal” welcome by the temple priests.

The Endowments Minister of AP Sri Anam Ramnarayan Reddy also accompanied the President for Srivari Darshan.

After offering prayers to the presiding deity of Sri Venkateswara Swamy inside the sanctum sanctorum, she was presented Sesha Vastram followed by Vedasirvachanam which was rendered at the  Ranganayakula Mandapam. 

Later, the first citizen of the nation was presented with the Theertha Prasadams, portrait of Srivaru, 2026 Diaries and Calendars published by TTD by the Chairman and EO.

TTD Trust board members Smt Panabaka Lakshmi, Smt Janaki Devi Sri Bhanuprakash Reddy, Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna were also present.

Among others the District Collector Dr Venkateswar, SP Sri Subbarayudu and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి 

తిరుమల, 2025 నవంబర్ 21: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు.

ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ 

శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగాఅహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంటరాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో గౌ||రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని  తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను గౌ|| రాష్ట్రపతికిఅందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.